ఈ పుట అచ్చుదిద్దబడ్డది
244

సంస్కృతన్యాయములు

ప్రస్తర ప్రహరణమున ఱాలు రువ్వుట యని మఱొక యర్ధము. ఱాలు రువ్వుటవలనను ననేకలాభాపత్తి దృష్ట మవుచున్నది. అనుపయోగములయిన చిన్నచిన్నఱాళ్ళుకాళ్లుకొట్తుకొనిపోవునట్లువ్యర్ధముగ నివువగాక అందందుపారవేయబడుటయు, యదుద్దేశమున ఱాలు రువ్వనారంభించితిమో అయ్యది సిద్దించుటయు, నెఱవేఱుచున్నవి. ఏతావాతా ఆశయ మేమన "ఏకాక్రియా ద్వ్యర్ధకరీ" అనునట్లు ఒకేకార్యమువ్లన ననేకార్ధసిద్ధి యవుపట్ల నీన్యాయముపయోగింపబడును.

ప్రావర్తికక్రమన్యాయము

బర్హిర్న్యాయము

బర్హిస్సు అనగా కుశ, ఆకుశఖండమువలె.

"బర్హి ర్దేవసదనం దామి--దేవతలకై కుశను ఖండించుచున్నాను" అను వాక్యముపై నీన్యాయ మాధారపడియున్నది.

దేవసదనమునకు కుశయంతయు ననవసరము. దాని కొనముక్కయే చాలును. కావున ఖండమాత్రమే బర్జిస్సు గ్రహింపబడుచున్నది.

అట్లే---ముఖ్యభాగగ్రహణమున నీన్యాయప్రవృత్తి కలుగును.