ఈ పుట అచ్చుదిద్దబడ్డది
230

సంస్కృతన్యాయములు

జామాతృశుద్ధిన్యాయము

అల్లుడు చేసిన పుస్తకపరిష్కారము విధమున్.

ఒకరాగు తనకుమార్తెకు తగిన వరుని నెతక తెమ్మని పురోహితునితో ననెను. ఆపురోహిడంతకుమున్ను రాజుకుమార్తెపైగాల్ పగ సాధింప నెంచి బఱ్ఱెలను మేపుకొను మూగ్ఖు నొకనిని తెచ్చి యితడు నీకు తగిన అల్లుడని చెప్పెను. రాజుకుమార్తె నాని తెలివి పరీక్షింపగొగి సభచేయించెను. ఆసభలో పండితులు క్రొత్తగారిచింపబడిన పుస్తకము వానిచేతికిచ్చి యిందు తప్పులు దిద్దుమనిరి. వాడు పురోహితుడు తనకంతము మున్ను చెప్పిన చొప్పున నోరు మెదల్చక ఊరకె పుస్తకము తిరుగవేయుచు ఉండిఉండి తొచక తనబొడ్డులో నున్న గోళ్ళుతీసుకొనుకత్తితో అక్షరములను, గీతలను, తలకట్లను గీకివేయనారంభించెను. దానిని చూచియే రాజుకూరు వానిమౌర్ఖ్యమును గ్రహించెనట.

డమరుకమణిన్యాయము

డమరుకమునకు మధ్యగల మ్రోయించు సాధనమువలె. శివుని చేతిలో నుండునది డమరుకము. ఆడమరుకమును వాయించుటకు మధ్యనొకకొయ్యముక్క కట్టియుంచబడును. దానిని మణి అందురు. డమరుకమును కదలించినపుడు మణి డమరుకమున కటు నిటు తగిలి డమరుకముమ్రోయించును. ఒకమణియే రెండువైపుల తాకి డమరుకమును మ్రోగించుట కుపయోగపడుచున్నది.