ఈ పుట అచ్చుదిద్దబడ్డది
224

సంస్కృతన్యాయములు

గింపబడును. ఆపాత్రతోక్షీరము, నీరు మున్ంగు పదార్ధములు నిర్ధిష్టమయమున తేవలసియుండును. కాని యీక్షీరపాత్ర కేవల పశుక్రతువునందే యుపయోగింపబడును. ఇతరక్రతువులం దెచటను తత్ప్రవక్తియేలేదు. కావున--అనిత్యములుగ సర్వసామాన్యములుగాక నిర్ధిష్టసమయములందె తఱచు వాడబడు వస్తుసముగాయమున నీన్యాయము ముపయుక్తము.

సర్ణమయీన్యాయమున కియ్యది విరుద్ధము.

గోపగృహెణీన్యాయము

పూర్వము ఇరువురు రాజదంపతు లుండేవారు. వారికొక కుమారుడు. రాణి కొంచెము చీకటితప్పులమనిషి. ఆమెకు రాజుగారన్న అసహ్యము. ఒకనాడామె రాజును విషము పెట్టి చంపి ఱంకుమగనియింటికి పోగా అతడు సర్పదుష్టుడై చనిపోయెను. ఆమె దేశాంతరమునకుపోయి అచట వేశ్యావృత్తితో జీవించుచుండెను. కొన్నాళ్ళకొకరాజపుత్రునకు నామెకు సంబంధము కలిగెను. ఇష్టాగోష్టిలో వారిరువు తల్లి, కొడుకులని తెలియవచ్చి ఒకరి నొకరు వదలివైచి ఆపాపప్రాయశ్చిత్తికై చితిపేర్చుకొని దానిపై నెక్కిరి. రాజముమారుడు చనిపోయెను. ఆమె మాత్రము చావక చితినుండి దొర్లి ప్రక్కనున్ననదిలో పడెను. నదీప్రవాహవశమున కొట్టుకొనిపోవుచుండగా, నామెనొక గొల్లవాడు ఒడ్డుకు జేర్చి తనయింటికి దీసికొనిపోయెను. వారిరువురును మహానురాగముతో ఆలు