ఈ పుట అచ్చుదిద్దబడ్డది
223

సంస్కృతన్యాయములు

ఈమంత్రము గార్హపత్యమును గూర్చి నుడువుచున్నదా, లేక, ఇంద్రత్వమును గూర్చి చెప్పుచున్నదా అని ప్రశ్నరాగా శ్తుతిలింగాదులచే గార్హపత్యబోధమే గాని ఇంద్రత్వబోధకము గాదని సిద్ధాంతీకరింపబడినదు. శ్రుతిలింగాదులచే విషయనిర్ధారణచేయు తావుల నీన్యాయము ప్రవర్తించును.

గుడశ్లేష్మన్యాయము

శ్లేష్మరోగి బెల్లము తినిన తొలుత శ్లేష్మము ప్రకోపించి తుదకు వెనుకటిదానితోసహా వెలికివచ్చును.

గుణవిరోధన్యాయము

గుణములు పరస్పరవిరుద్ధములుగానే యుండును. వాతాదిన్యాయమును జూడుము.

గుణోపసంహారన్యాయము

సామాన్యముచే విశేషమును సాధించునట్లు.

గోగవయన్యాయము

గోవు, గవయమృగము రెండు నొకేమాదిరిగ నుండును. కాని పాలలో మాత్రము భేదము గలదు. కాచమణి, కాకక్షిక, హంసబక, న్యాయములను జూడుము.

గోదోహనన్యాయము

ఒకరకపుక్షీరపాత్రకు గోదోహనము అనిపేరు. పశువృద్ధి కామనయా చేయబడు క్రతునందీ పాత్ర యుపయో ఏ