ఈ పుట ఆమోదించబడ్డది

7

సంస్కృతన్యాయములు

అలంకృతిశిరశ్ఛేదన్యాయము
  • ఒడలంతయు నలంకరించి తల తెగ వేయుట.
అలాతపిశాచన్యాయము
  • కొఱవిని చూచి దయ్య మనుకొనునట్లు.
అలాబూపాషాణన్యాయము
  • రాతిలో బుట్టిన సొరకాయ రాతినెరియ యెట్లుండునో యట్లె పెరుగును.
అవినాభావసంబంధన్యాయము
  • ఒకదానికొకటి సంబంధించి యుండుట.
  • (కుండయు, మట్టివలె; పూవు, తావివలె)
అవ్యాపారవ్యాపారన్యాయము
  • పనిలేనివాఁడు పనిగల్గినవానిని చెఱచుట.
  • (కూసేగాడిద మేసేగాడిదను చెఱచె నన్నట్లు)
అహికుండలన్యాయము
  • కుండలాకారముగా చుట్టలు చుట్టుకొనుట సర్ఫమునకు స్వాభావికధర్మ మయినట్లే మనుష్యునకుఁగల స్వాభావిక గుణము తదనుగుణముగ నవశ్యము ప్రవర్తించును.
అశ్మలోష్ఠన్యాయము
  • మంటిబెడ్డ దూదికంటె కఠీనమే యైనను పాషాణము కంటె మెత్తనిదే.