ఈ పుట అచ్చుదిద్దబడ్డది
220

సంస్కృతన్యాయములు

ఖరీవిషాణన్యాయము

గాడిదకొమ్ములలాగా. శశవిషాణన్యాయమును జూడుము.

ఖలే కపోతన్యాయము

కళ్ళములో గింజలేరి తినుటకు దిగి వలలో దగుల్కొనిన పావురములు అన్నియు నొటియై వలతో నెగిరి పోయి ప్రాణము దక్కించుకొనినవట.

ఒకపనిని సాధించుటకు సాధకము సముచ్చయముపైనున్నపుడీన్యాయము ప్రవర్తించును.

"సముచ్చయోయ మేకస్మిన్ సతి కార్యస్య సాధకే ఖలే కపోతికాన్యాయా త్తత్కర: స్యాత్పరోపిచేత్:"

బాదఘాతకన్యాయము

తినేవారే చంపేవారుకూడా అవుదురు. చేపలను తినువారు చేపలను చంపేవారు కారు?

గగనరవిందన్యాయము

ఆకాశముమీద తామరపూలవలె.

ఖపుష్ప, గగనకుసుమ న్యాయములను జూడుము.

గజఘటాన్యాయము

గజ, ఘటా శబ్ధములు రెండును గజవాచకములే. కాని రెంటిని కలిపి ఏనుగు అనునర్ధమున నుపయోగింతురు.