ఈ పుట అచ్చుదిద్దబడ్డది
219

సంస్కృతన్యాయములు

ఆయావిగ్రహములయందు రూఢమై జనించిన పరమేశ్వరభేదబుద్ధిజమవు దోష మాయావిగ్రహారాధనములవలన గలిగిన స్కృతమహిమచే నుత్పన్నమవు వద్వైతబోధచే నశించును.

క్ర్త్వాచిన్తాన్యాయము

"ఇత్యేవం కృత్వా చిన్త్యతే! కృత్వాచిన్తేయం" మొందొకవిధముగ విధిని కల్పించుకొని చేసి పిమ్మట దానినే విచారించవలయునన్నట్లు.

కైదారికాన్యాయము

వ్యవసాయదారుడు నీటికాలువలోనుండి ఒకపొలమునకు నీరు పెట్టి ఆతూము మూసివైచి మఱొకపొలమునకు నీరు పెట్టుచుండునట్లు.

కోష్టపానన్యాయము

ఇంటికి తెప్పించుకొని కల్లుత్రాగినట్లు. రహస్యముగ దుష్కార్యములను చేయుట అనిభావము.

క్రమవిషర్యాసన్యాయము

ముందు వెనుక, వెనుక ముందు, క్రమభంగముగ పనులలో ప్రవర్తించుట.

ఖపుష్పన్యాయము

గ్గనకుసుమన్యాయమును జూడుము.