ఈ పుట అచ్చుదిద్దబడ్డది
213

సంస్కృతన్యాయములు

కాకిణీన్యాయము

ఒక్కకానీమూలమున అన్నదమ్ములకు తల్లిదండ్రులకు వైరము సంభవించి సర్వనాశనము సంభవించును.

కాచమణిన్యాయము

ఒకేరముగ ప్రకాశించు;నను గాజు గాజే, మణి మణియే, కాకపికన్యాయమును జూడుము.

కాణ్డానుసమన్యాయము

ఋత్విక్కులకు మధుపర్కాదు లొసంగుటలో రండురకములు గలవు- పదార్ధానుసమయము, కాండానుసమయము-అని.

వరణ్క్రమమున నెల్లఱకు నాసనమెసగి పిదప అర్ఘ్యము, పాద్యము, మున్నగునవి వరుసన యిచ్చుట పదార్ధానుసమయము.

ముందొకనికె ఆసనము, పద్యము, మధుప్త్కముమున్నగునవన్నియు నిచ్చి తరువాత వేఱొకని కన్నియు వరుసన నిచ్చుచు ఈక్రమముననే ఎల్లఱకు నిచ్చుట.

అభీష్టవ్యవహారము ప్రత్యేకముగ ప్రతియొక వస్తు;వునకును క్రమముగ జరిగించునెడ నీన్యాయము ప్రవర్తించును.

కామాకులకామినీన్యాయము

కామవిహ్వలయైన కామిని ప్రియునికొఱకై పరితపిచునట్లు.