ఈ పుట అచ్చుదిద్దబడ్డది
212

సంస్కృతన్యాయములు

పరస్పరబాధ్యబాధకభావమున నీన్యాయ మపయుక్తము, సుందోపసుందన్యాయమును జూడుము.

కాకదధ్యువఘాతకన్యాయము

"కాకేభ్యో రక్ష్యతాం సర్పి రితి బాలో పి చోదితు, ఉపఘాతుపరే నాక్యే న శ్వాదిభోన రక్షతి?"

ఈపెరుగును కాకులు ముట్టుకొనకుండ చూచుచిండమని చెప్పిన, ఆబాలుడు కాకులను తోలి కుక్కలు ముట్టుకొనిన చూచుచు నూరకుండునా? ఉండడు, వానినికూడ తోలివేయును. కాకశబ్ధముచేతనే శునకాదులుకూడ అక్షిప్తము లవుచున్నవి. అట్లే---

"యేత్విమం విష్ణు మవ్యక్తం మాంచ దేవం మహేశ్వరం, ఏకీభావేన పశ్యన్తి నటీషాం పునదుద్భవ:"

అనిన విష్ణుమహేశ్వరపదములఛే బ్రహ్మను ఏకత్వబుద్దితో జూచినను పునర్జన్మ కలుగదని బ్రహ్మపద మాక్షిప్త మవుచున్నది.

కాకాధికరణన్యాయము

ఫలానాయిల్లు ఏది అని అడిగిన ఆకాకి వాలియున్న యిల్లు అని చూపినట్లు.

ఉపలక్షణమును సూచించుచు పృష్టవస్తునిర్దేశ్ము చేయు నెడ నీన్యాయ ముపయుక్తము.