ఈ పుట అచ్చుదిద్దబడ్డది
209

సంస్కృతన్యాయములు

సూత్రమున్మ బహువచనప్రయోగముచే మూడింటిని అని స్ఫష్ట మగుచున్నది.

"ఇహేదానీం చతుర్ణాం మహాభూతానాం సృష్టిసంహారవిధి కుచ్యతే"

మహాభూతానామి త్యుక్తే త్రయాణామేవ పరిగ్రహ: కపింజలా నాలభేతేతిన ద్బహుత్వసంఖ్యాయా స్తావత్యేవ చరితార్ధత్వాత్! అత శ్చతుర్ణా మిత్యుక్తం'

కమ్బలనిర్ణేజనన్యాయము

కంబళి కాళ్ళకు వేసి దులిపినట్లు

కాళ్ళకు బాదుచు కంబళిని దులిపిన కంబళి బాగుపడుటయు, కాళ్ళదుమ్ము వదుటయు రెండులాభములు కలుగుచున్నవి.

"ఏకాక్రియా ద్వ్యర్దకరీ" అన్నట్లు ఒకేపనివలన ఫలబాహుళ్యము సంభవించునపు డీన్యాయముపయోగిమపబడును.

"అపిచ దధిల్ ఉభయ మసమర్థం కర్తుం ఫలం సాధయితుం హోమంచ నను కమలనిర్ణేజనవ దేత ద్భవిష్యతి నిర్ణేజనంహి ఉభయం కరోతి కంబలశుద్ధిం పాదయోశ్చ నిర్మలతామ్".

కరకంకణన్యాయము

కంకణము అనిన చేతి కలంకారముగ ధరించు భూషణము అని అర్ధము. అయినను కరకంకటము అందురు.