ఈ పుట అచ్చుదిద్దబడ్డది
206

సంస్కృతన్యాయములు

ఉభయతస్పాశాబద్ధన్యాయము

రెండువైపుల త్రాళ్ళచే బంధింపబడి యున్నవాడు వలె. ఎటూ మెదలలేని స్థితి అని భావము.

ఊర్ణనాభిన్యాయము

లూతాతంతున్యాయమును జూడుము.

ఋతుమతియైన కన్య తనతలిదండ్రులనుండి దృష్టి మఱల్చి భర్తపై ననురాగము, ప్రేమజూపుచు సుఖమనుభవించుచు మాహానందము నొందును.

సంసారత్యాగము చేసిన బ్రహ్మజ్ఞాని బ్రహ్మయందే తన మనోవాక్కాయముల నునిచి మహానంద మొందును.

ఏకవృంతగతఫలద్యయన్యాయము.

ఒకేతొడిమను రెండు పండ్లున్నట్లు. శ్లేషయం దొకేపదమున రెండర్ధములు స్ఫురించుచుండును.

ఏరండాబీజన్యాయము

ఆముదపుగింజను (కాడనుండి విడదీసిన) నీటితోదడిపిన పైకెగురును.

జలతుంబికా, పంజరముక్తవిహంగోడ్డీన, పంజరముక్తపక్షిన్యాయములను జూడుము.

ఓతప్రోతన్యాయము

బట్టలో పడు;గు పేకవలె.