ఈ పుట అచ్చుదిద్దబడ్డది
205

సంస్కృతన్యాయములు

ఇందుక్ష్వేదన్యాయము

ఈశ్వరుడు చంద్రుని, విషమును గ్రహించినను చంద్రుని తలపైనను, విషమును కంఠమందును ధరించినవాడు.

అట్లే--బుద్దిమంతుడు గుణదోషములను రెంటిని గ్రహించి గుణములను వెలువరించును; దోషములను అణచివేయును.

ఇంద్రజాలన్యాయము

కనుకట్టువిద్యవలన ఒకటి మఱొకటిగా కనబడునట్లు.

ఉదా:-- మిధ్యాప్రపంచము.

ఇషుకారన్యాయము

బాణములుచేయువాని విధమున.

"ఇషుకారో నర: కశ్చి దిషా వాసకతమానసు, సమీపేనాఫి గచ్చన్తం రాజనం వావబుద్ధనాన్".

బాణములు చేయువా డొక డాబాణముల దృష్టిలోపడి తనదగ్గఱనుండియేపోవుచున్న రాజునునుసైతము గుర్తించలేదట. స్వరార్యవ్యగ్రతచే ముగ్ధు డయ్యెనని భావము. అట్టిసందర్భముల నీన్యాయము ప్రవర్తించును.

ఇక్షుదండన్యాయము

చెఱకుగడలోని కణుపు లొకదానికన్న మఱొకటి రుచిగా నుండును.

ఉదా:--(జరిగినకొలది) సజ్జనమైత్రి.