ఈ పుట ఆమోదించబడ్డది

5

సంస్కృతన్యాయములు

అతిపరిచయన్యాయము
  • అతిపరిచయముచే నవజ్ఞ గలుగును.
  • 'అతిపరిచయా దవజ్ఞా.' కు.చే. 1-105.
అపరాహ్ణచ్ఛాయాన్యాయము
  • అపరాహ్ణము దాటినతరువాత మనుష్యునినీడ క్రమక్రమముగ ఉత్తరోత్తర మభివృద్ధి నొందుచు జిరకాలవ్యాపిని యవును. అట్లే ఉత్తరోత్తరాభివృద్ధి, చిరకాలవ్యాపకతలయం దీన్యాయ ముపయోగింపబడును.
అపృచ్ఛోత్తరన్యాయము
  • అడుగకుండగనే ప్రత్యుత్తరము చెప్పుట.
అప్రసక్తనిషేధన్యాయము
  • వెనుకటిగ్రంథమువలన జెప్పఁబడినధర్మము సంబంధము లేని స్థలమందుఁగూడఁ బ్రసక్తించినపుడు దానిని నిషేధించవలయునుగాని ప్రసక్తించనిది నిషేధించఁగూడదు.

ఎట్లనిన:- 'ప్రాతఃకాలమునఁ బువ్వులు వికసించును.' అను వాక్యముచే సకలపుష్పములు వికసించుట చెప్పఁగాఁ గలువపువ్వులకుఁగూడ వికాసము ప్రసక్తించినది. కావునఁ గలువలు వికసించవని నిషేధించవలయును. ఇది ప్రసక్త నిషేధము అనఁబడును.

'చీఁకటి తెల్లఁగ నుండదు' ఇది యప్రసక్తనిషేధము.