ఈ పుట అచ్చుదిద్దబడ్డది
201

సంస్కృతన్యాయములు

అహిభుక్కైవర్తన్యాయము

నల్లమందుతినిన ఉన్మత్తుడు, జాలరివలె.

నల్లమందుతిని మతిపోయినవాడొకడు పడవనెక్కి పొవుచు తక్కినమనుష్యులలో కలిసి మాఱుపడుదునేమో అనుభయమున తనకాలికిని పడవకును త్రాటితో కట్టివైచి కొని పరుండేను. వాడు గాడనిద్రపోయినపిమ్మట పల్లెకారి పరిహాసమునకై ఆత్రాటిని విప్పి తనకాలికి కట్టివైచికొని పరుండెను. కొంతసేపటికి ఉన్మత్తుడు మేల్కొని తనకాలికి త్రాడు లేకుండుటయు, పల్లెవానికాలు ఆత్రాటిచే కట్టబడియుండుటయు జూచి వాడే నేను; నేనేవాడు అను తాదాత్మ్యాధ్యాసతో లేచి వానితో--ఓరి! నేనే నీవు: నీవే నేను--అని వదనపెట్టుకొనెనట.

అట్లే--తాదాత్మ్యాధ్యాసయం దీన్యాయముప్రవర్తించును.

అహిమఊషకన్యాయము

అహినకుల, వ్యానలకుల న్యాయములట్లు.

"తే. వినవె యహీమూషకన్యాయమున ధరిత్రి నాక్రమంబున నమరేండూ యసురవిభుని తోడ సంధింపు మని పంపె దోయజాత వాధు డరుదెంచె వైకుంఠనగరమునకు." దశావ. కూర్మ. 49 పు.