ఈ పుట అచ్చుదిద్దబడ్డది
198

సంస్కృతన్యాయములు

ఉదా:---నీలఘటాదులు.

అరణ్యచంద్రికాన్యాయము వవచంద్రికాన్యాయమును జూడుము.

అరుణైకహాయనీన్యాయము

ఒకసంవత్సరము వయసుగల ఎఱ్ఱని ఆవు అన్నట్లు. అరుణశబ్ధము అరుణగుణవాచకము. గుణివిషయికముగ ప్రయోగింపబడినపుడు ఆ అరుణశబ్ధము అరుణగుణివాచకముగూడ నగుచున్నది.

ధర్మవాచకము ధర్మివిషయత్వముగ బ్రయోగింపబడి ధర్మివాచైకమైనపు డీన్యాయ ముపయోగింపబడును.

అరుంధతీప్రదర్శనన్యాయము

అరుధతిని చూపించినట్లు

"యధారుస్థతీం దిదర్శయషు స్తత్సమీపస్థాం స్థూలాం తారా మముఖ్యాం ప్రధమ మరుద్ధతీతి గ్రాహయిత్వాతాం ప్రత్యాఖ్యాయ పశ్చా దురుంధతీమేవ గ్రాహయతి తద్వ న్నాయ మాత్మేతి బ్రూయూత్"

శాంకరబ్రహ్మసూత్రభాష్యం 22 1. అరుంధతిని చూపవ్చలయుననిన తొల్దొల్త అరుంధతీ నక్షత్రసమీపమున నున్న పెద్దనక్షత్రమును జూపె తత్ప్రత్యాఖ్యానముచేయుచు దానిసమీపముననున్న చిన్ననక్షత్ర మరుంధతి యని బోధించునట్లు.

ఆధ్యారోపాపవాద న్యాయమును జూడుము.