ఈ పుట అచ్చుదిద్దబడ్డది
195

సంస్కృతన్యాయములు

అనువృత్తిన్యాయము

పూర్వసూత్రమునిండి కొన్నిపదములు అర్ధవివరణమునకై ఉత్తరసూత్రములోనికి గొనిపోవుట అనువృత్తి అనబడును. (వ్యాకరణాదిసూత్రములయందీ అనువృత్తి సుస్పష్టము)

స్వప్రయోజనసాధనమునకై పూర్వపూర్వాంశములనాశ్రయించుపట్ల నీన్యాయము ముపయుక్తము.

అనువృత్తి ఆవృత్తికి రూపాంతరము. అవృత్తియన నుద్దిష్ట విషయమును మఱల మఱల వచించుట. అట్లొనర్చుటవలన పూర్వ విషయము సుదృఢ మవును.

"అభ్యాసం కూసువిద్య" అన్నట్లు.

అన్యోన్యాశ్రయన్యాయము

ఒకచోనొకవస్తువుండిన నింకొకవస్తు వుండును. అది లేనిచో రండవరియు నుండరు. వానిలో మొదటిది రండవదానికి కారణమవును. దీనికే అజ్యయ వ్యతిరేక మని పేరు.

"జన్మాద్యస్య యతో  న్వయా దితరత్:..... భాగవతము.