ఈ పుట ఆమోదించబడ్డది
4
సంస్కృతన్యాయములు
- అగ్నివమ్రిన్యాయము
- నిప్పునకు చెదలు పట్టునా?
- అగ్నివహ్నిన్యాయము
- అగ్నిని అగ్ని తగులఁబెట్టఁగలదా ?
- అచలచలన్యాయము
- నడచుచున్న యోడమొదలగువానిపై నెక్కి పోవునపుడు కదలక నిలచియున్న తీరము వృక్షములు మున్నగునవి నడచుచున్నట్లును, నడచుచున్న యోడ నిలిచినట్లును కన్పించును.
- అజగరన్యాయము
- కొండచిలువ నిద్రబోవుచున్నట్లే పడియుండి తన్ను సమీపించిన జంతువును ఆకస్మికముగఁ బట్టి మ్రింగివేయును.
- అజాకృపాణీయన్యాయము
- కత్తి లేనికారణమున దన్ను జంపఁజాలక యుపాయ మరయుచున్న యొకపురుషునిపై మేక యొకటి మదమున గాలు ద్రవ్వెను. అట్లు త్రవ్వినమట్టిలో నొకకృపాణము బయటపడెను. వాఁ డది గైకొని దానిం దెగటార్చెను.
- అజాగళస్తనన్యాయము
- మేక మెడక్రింది చన్నులు నిష్ప్రయోజనములు. కళా. 1-7
- అణుకులాచలన్యాయము
- అణువునకు పర్వతమునకుఁ గల తారతమ్యము.