ఈ పుట అచ్చుదిద్దబడ్డది
190

సంస్కృతన్యాయములు

అండకుక్కుటీన్యాయము

గ్రుడ్డు లేనిదే కోడి రాదు; కోడి లేనిదే గ్రుడ్డు రాదు. బీజాంకురన్యాయము జూడుము.

అంధవవర్తకన్యాయము

పై అంధమవర్తకీయ న్యాయమును జూడుము.

అగతికగతిన్యాయము

గతిలేనివా డేదోయొక గతి చూచుకొనునట్లు.

మగడు దొఱకనప్పుడు అప్పమగడే గతి అన్నట్లు.

అగ్నిసిఖాన్యాయము

అగ్నిజ్వాల ఎటు త్రిప్పినను మీదికే పోవును.

అగ్నిహోత్రన్యాయము

"యావజ్జీవ మగ్నిహోత్రం జహోతి" "ప్రదోష మగ్నిహోత్రం హోతవ్యం వ్యుష్టాయాం ప్రాత:" ఇత్యాది వాక్యములచే దినదినము విధిగా అగ్నిహోత్రోపాసన చేయవలయునని శ్రుతులచే విధింపబడియున్నట్లు. ఇతరకార్యములన్నియు వదలియైన నేదేనియొక ముఖ్యకార్యము నవశ్య మాచరింపవలయునని విధి గల తావుల నీన్యాయ ముపయుక్తము.