ఈ పుట ఆమోదించబడ్డది
188

సంస్కృతన్యాయములు

అన్యోన్యసంరక్ష కత్వమున నీన్యాయప్రవృత్తి, వనసింహ, వనవ్యాఘ్ర న్యాయములను జూడుము. మడుగులోని మొసలివలె అని మఱొక యర్ధము.

"నీటిలోనిమొసలి నిగిడి యేనుగు దీయు బైట కుక్కచేత భంగపడును." (వేమన) శ్వానమకరన్యాయమును జూడుము.

క్షీరనింబన్యాయము

వేపచెట్టునకు పాలుపోసిఎ పెంచినను చేదు పోదు.

ఎంతబోధించినను దుష్టుడు తనదౌష్ట్యము విడువడు.

క్షీరవీరన్యాయము

పాలు, నీరు కలసినట్లు.

ఉ.క్షీరము మున్ని నీటి కొసగెన్ స్వగుణమును దన్ను జేరుటన్ క్షీరము తప్తమౌట గని చిచ్చుఱెకెన్ నెతచే జలంబు దుర్వ్వరవిహృద్విపత్తి గని వహ్ని జొరంజనె దుగ్ద మంతలో నీరముగూడిశాంతమగు నిల్చుమహాత్ముల మైత్రి యిద్దరన్ (భర్తృహరి.)

క్షీరపాషాణన్యాయము

పాలకొఱకు ఱాల మోసినట్లు.

కావడిలో నొకప్రక్కను పాలకుండను బెట్టుకొని రండవ ప్రక్కను దానిబరువు సరితూగుటకై ఱాళ్లను చెట్టుకొనుట మన మెఱింగిన యంశమే.