ఈ పుట ఆమోదించబడ్డది
185

సంస్కృతన్యాయములు

యతోహ మనస్తాపత్యాపి దుర్జనచక్షుర్దోషభయాఅ దవి వేకాతభి ర్మంత్రిభి ర్వంధ్యేతి ప్రఖ్యాపితా లోకేమమైనాపత్యా న్యన్యజనాపత్యతయా గీయన్తే సో యం స్వేదజనిమిత్తేన శాటకత్యాగన్యాయ:"

చెడుదృష్టికలవా రెవరేని చచ్చి చూచిన దృఇష్టిదొషము తలులునేమో యను భయమున చాలమంది పిల్లలు కలదేయైనను ఒకావిడ సంతానములేదు. గొడ్డురాలను అని లోకమునకు చెప్పుకొనుచు తనసంతానమునే చూచి వీరు నాపిల్లలుకారు; ఎఫరిపిల్లలో అని చెప్పుకొన్నట్లు. మృగభియా సన్యానాశ్రయణన్యాయము, యూకాభియా కంధానాశ్రయణన్యాయమును జూడుము.

హంసకాకన్యాయము

హంస హంసే, కాకి కాకే.

కొండకొనను కూర్చుండిఉన్నా కాకి కాకే. ఇసుకతిన్నె మీద సంచారము చేసినను హంస హంసే. ఏనుగు నెక్కి పోయినను మూఢుడు మూఢుడే. కాలి నడైకను పోయినను పండితుడు పండితుదే. పంజరములోపెట్టి పోషించినను కాకి కాకేగాని హంసతో సమానమవునా?

పంజరబకన్యాయమువలె.

హంసబకన్యాయము

హంస హంసే; కొంగ కొంగే'