ఈ పుట ఆమోదించబడ్డది
174

సంస్కృతన్యాయములు

సూచీముఖన్యాయము

కొన్ని క్రోతులు చలిబాధకోర్వక అగ్నికణములను భ్రాంతితో గురువిందగిమజలను ప్రోవుచేసి చలికాచుకొననారంభించెను. కాని, వానికద్దాన చలిబాధతీరకపోవుటయేగాక మఱింతహెచ్చుగకూడనుండెను. అదేసమయమున సూచీముఖమను నొకపక్షి యటుపోవుచు వానిజూచి నవ్వి--ఓమూర్ఖవానరములారా! అవి నిప్పురవలు కావు. గురువెందగింజలు. అదిగో ఆగుహలోనికి పొండు. అచట వెచ్చ నుండును. మీచలిబాధ శాంతించును-- అని చెప్పెను. క్రోతులు వినక వెక్కిరించినవి. మఱల సూచీముఖ మటులే చెప్పెను. వెంటనే క్రోతులు లెనిపోని కోపమున--నీవా మాకు బుద్ధిచెప్పునది? అసలు నీకు మాఊసెందుకు?-- అని గద్దించుచు పై బడి కొట్టి చంపివైచినవి.

తనకు మాలిని జోలికి పోయి ఆపదలబడినతావును నీన్యాయము ప్రవర్తించును.

దీనికి సూచీముఖీన్యాయ మనియు బేరుకలదు.

సూచీశతపత్రన్యాయము

నూఱు దలములు గల తామరపూవును ముద్దగగ పట్టుకొని సూదితో గ్రుచ్చినచో నూరురేకులు చిల్లులు పడును. విప్పిచూచిన నవి అన్నియు నొకేమాఱుగ చిల్లువడినట్లు తోచును, కాని కాలభేదము కలదు. ఒకరేకులో