ఈ పుట ఆమోదించబడ్డది
165

సంస్కృతన్యాయములు

వినాశసమయము వచ్చినపు డొకరు కూలత్రోయకయే ఇసుకనేలలోనిబావివలె సర్వము కూలి అగాధమున బడిపోవును.

సికతాతైలన్యాయము

ఇసుకలోనుండి నూనెనువలె.

"తివిరి యిసుమును దైలంబు దీయవచ్చు; దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు: దిరిగి కుందేటికొమ్ము సాధించవచ్చు; జేరి మూర్ఖులమనసు రంజింపరాదు."

భర్తృహరి

సుందోపసుందన్యాయము

మున్ను అన్నదమ్ములైన సుందోసుందులను నిరువురు రాక్షసులు అన్యోన్య మతివాత్సల్యమున వర్తించుచు నొకనాడు తిలోత్తమ యను దేవకాంతకై పరస్పరము పోరిచచ్చిరి.

"అన్యోన్యనాశ్యనాశకవివక్షాయాం సుందోపసుందన్యాయ:"

అన్యోన్యము వధ్యఘాతకభావమున సుందోపసుందన్యాయము ప్రఫర్తించును.

(రాముడూ, రంగడూ, ఓకటే, రొట్టెదగ్గఱ గిజగిజ)

సుతజన్మమృతిన్యాయము

కొడుకు పుట్టుట, గిట్టుటకూడ సంభవించినట్టు