ఈ పుట ఆమోదించబడ్డది

1

ఓం

సంస్కృత న్యాయములు

అంకుశన్యాయము
  • గొప్పయేనుఁగు చిన్న అంకుశమునకు లోఁబడినట్లు.
అంకోలబీజన్యాయము
  • ఊడుగచెట్టుగింజలు క్రింద రాలి యురుము వచ్చినతోడనే మరల మ్రాని నంటుకొనును.
అండవిస్రంభన్యాయము
  • బుడ్డను నమ్మి యేటఁ బడినట్లు.
  • "ఎంతయు బుడ్డనమ్ముకొని యేటనుబడ్డవిధంబు కాదొకో" - శ్రవణానందము.
అంతర్దీపికాన్యాయము
  • కుండలోనున్న దీపము పైకి ప్రకాశింపక లోపలనే వెలుగును.
అంధకరదీపికాన్యాయము
  • గ్రుడ్డివాని చేతిలోని దీపము వానికేమియు నుపయోగింపదు.
అంధకవర్తకీయన్యాయము
  • పిచ్చుకదగ్గఱ చప్పట్లు కొట్టిన అది చేతిలోనికి వచ్చునా ? అసంభవమని భావము.