ఈ పుట ఆమోదించబడ్డది
162

సంస్కృతన్యాయములు

సాక్షౌరుషన్యాయము

"సాక్ష: పురుష పరేణ చే న్నీయతే నూన మక్షిభ్యాన పశ్వతి అను వాక్యమున శ్రీ న్యాయము సంక్షిప్త రూపము.

సనులుగలమానిసి ఒకరిచే చేయిపట్టుకొని తీసికొనిపోబడుచున్నయెడల నిజముగ 'నాతడు కళ్ళతో జూడడు. వేదము వల్లించియు వేదమంత్రార్ధముల నెఱుంగనేఱక యజ్ఞాదికర్మాచరణమునకు భాష్యాదులపైనను, ఇతరుల పైనను నాధారపడియుండుమానిసి కీన్యాయము ముదాహరణముగ గైకొనబడును.

సింహఘంటాన్యాయము

సింహముమెడలో గంట కట్టువా రెవరు? విప్పువారెవరు?

సింహమృగన్యాయము

సింహమునకు లేళ్ళకు సహజవైరము.

వ్యాలసకులన్యాయమును జూడుము.

సింహమేషన్యాయము

ఒకగొల్లవా డొకసింహపుపిల్లను పట్టుకొని తనమేకలతోబాటు పెంచుచుండెను. అదియు మేకలతో కలసి మలసి తిరుగుచు, తానుకూడ మేకనే అను బుద్దితో వర్తించుచుండేను. ఒకనాడది అరణ్యమునబడి తోడి సింహములను జూచెను. అవి దాని పరిస్థితినిగుర్తించి