ఈ పుట ఆమోదించబడ్డది
148

సంస్కృతన్యాయములు

 "వెంటదవిలి బోధించిన వింతకైన నార్జన మ్మొంద డొకయింత దుర్జనుడు స్వేదనాభ్యంజనోద్బంధనాదివిధివి నామితశ్వౌచ్చమువూలె రామకృష్ణ!"

వ్యాఖ్యాతల రామకృష్ణశతకమునుండి.

శ్వపుచ్చోన్నామనన్యాయము

పైశ్వౌచ్చన్యాయము వలెనే

"నచైష శక్యతేకర్తుం నమ్రో యత్నశత్తె రపి, కోహి స్వేదశతే నాపి శ్వపుచ్చం నామయిష్యతి?"

మఱియు--వాలియందు కుక్కతోకను పైకెత్తు బ్రయత్నించినట్లు.

వ్యతిరేకమున నుదాహరణము:-- ధూర్తుడై కనుగానక తిరుగువాని నెవడు నమ్రు నొనరింపగలడు?

శ్వలీఢపాయనన్యాయము

కుక్క ముట్తుకొనిన పాయసమువిధమున.

"అపి ప్రయత్నసంపన్నం కామేనోపహతం తప:, న తు;ష్ణయే మహేశస్య శ్వలీఢ మివ పాయనమ్".

గట్టిప్రయత్నముతో ప్ర్రారంభింపబడినను కామవిద్ధమవునెడల తపస్సు కుక్క ముట్టుకొనిన పాయసమువలె మహేశ్వరతుష్టికి కారణము కానేఱదు.