ఈ పుట ఆమోదించబడ్డది
147

సంస్కృతన్యాయములు

(యాగప్రకరణములందు శ్వేనాధికరణ మోకంచు కలదు.)

దుష్టున కధికార మిచ్చినమచ్చున.

శ్రితిబలీయస్త్వన్యాయము

శ్రుతిక్రమ, అర్ధక్రమ, పాఠక్రమ, ప్రవృత్తిక్రమముల యందు ప్రవృత్తిక్రమముకన్న పాఠక్రమమును, దానికంటె అర్ధక్రమమును, దానికన్న శ్రుతిక్రమమును క్రమముగ బలీయము లయినట్లు.

పూర్వపూర్వ మౌన్నత్యసూచనమున నీన్యాయము ప్రవర్తించును.

శ్వపిశునన్యాయము

లోబికిని కుక్కకును భేదము లేదు.

లోభికిని కుక్కకుని స్థిరబుద్ది శూన్యము; తోడివారల జూచిన విరువురకును సరిపడదు.

శ్రోత్రశృంగాన్యాయము

ముందుకువచ్చిన చెవులకన్న వెనుకవచ్చిన కొమ్ములు వాడి

శ్రోత్రియవిటన్యాయము

శ్రోత్రియవిటుడొకడుతనవిటకత్తెను మడికట్టుకొమ్మన్నట్టు.

శ్వపుచ్చన్యాయము

కుక్కతోకను సరిచేయ బ్రయత్నించినట్లు