ఈ పుట ఆమోదించబడ్డది
133

సంస్కృతన్యాయములు

వ్రీహిబీజన్యాయము

బియ్యపుగింజ పైభాగమున ఊకతోను, దానిక్రింద తవుడు, మున్నగు రేణువులతోను కప్పబడియుండును.

ఉదా:- సత్వగుణము పైన తమోగుణముచేతను, దానిక్రింద రజోగుణముచేతను ఆవరింపబడియుండును.

వ్రీహి అనగా ధాన్యమును బాగుగా రోకళ్లతో దంచి పైన ఆవరించియున్న ఊక తవుడు మున్నగువానిని తొలగించి లోపల గూఢముగ నున్న బీజములు అనగా బియ్యమును వెలికి దీయుదురు.

ఉదా:- అన్నమయూదికోశతుషసముదాయమున నిగూడముగ దాగియున్న పరతత్వమును వేదవేత్తలు యుక్త్యవఘాతములచే బియ్యము విధమున వెలెజేస్తురు.

"ఉ. ఖాద్యము విశ్వవిశ్వ మొలయలయన్ సృజియించి యనుప్రవిష్టమై సద్యము దాన గొశతుషజాతసుగూడమయైన దేని సుద్యద్వ్యశుతా కవుల్ వెలికి దార్తురు తండుల మెట్టు లట్తు లోవేద్య! సుయుక్తిఘాతముల: వింటివే, నీవును దత్త్వ మద్దియే."

వ్యాఖ్యాతల శంకరవిజయమునుండి

శంకూత్ఖాతదంష్ట్రోరగన్యాయము

కోఱలు ఊడబెఱికినపామువలె.

మూలబలమును నాశనము చేసిన శత్రు డేమియు జేయజాలడు.

ఉత్ఖాత దంష్ట్రోరగన్యాయమును జూడుము.