ఈ పుట ఆమోదించబడ్డది
129

సంస్కృతన్యాయములు

వేశ్ల్యాపుత్రజనకన్యాయము

వెలియాలికొడుకునకు తండ్రి వెవడో నిర్ధారణ లేనట్లు

వ్యంజకవ్యంగ్యన్యాయము

గూఢమై ప్రయుక్తశబ్రములచే సిద్ధించు నొకవిలక్షణమైన యర్ధాంతరము వ్యంగ్యము. అన్యంగ్యమును స్ఫురింపజేయు శబ్ధము వ్యంజకము. వ్యంజకమునకు ఫలము వ్యంగ్యము; వ్యంవ్యమునకు మూలము వ్యంజకము.

అట్లే--- వేదాధ్యయనమునకు ఫలము ఫలవదర్ధావబోధ. అనగా వేదవిహితక్రియాకలాపాచరణమే ఫలముగా గలిగిన వేదమంత్రాత్ధావబోధ. అనగా--- వేదమంత్రార్ధములను బాగుగ నెఱింగికొని అందు విధింపబడిన క్రియాకలాపములను విధివిధానమున నాచరించుట. ఆ ఫలవదర్ధావబోధకు మూలము వేదాధ్యయనము.

వ్యక్తిన్యాయము

ఒకానొక అర్ధమందు రూఢమైనయున్న వ్యక్తిని గుఱించి మాటాఘునపుడు లక్షణాదులచే మఱొకవ్యక్తి నావ్యక్తర్ధముచేసి చెప్పు టసంగతము. అనంగా--- ఒకనిని గూర్చిన ప్రస్తానమున దత్సమలక్షణలక్షితు డవునంత మాత్రమున అప్రకృతుడవు వేఱొకనివిషయము స్వీకరించుట అసమంజసము..

"కౌశికో వాక్య మబ్రనీత్" అనినపుడు కౌశికుడు అనగా విశ్వామిత్రుడు ఇట్లనెను అనుటకుబదులు 'దివాంధం