ఈ పుట ఆమోదించబడ్డది
127

సంస్కృతన్యాయములు

చెట్టుపైనున్నవానిని దిగిరమ్మనెను. పిదప నందఱుగలసి చెట్తు మ్రాను నటునిటు శక్తికొలది ఊపుఛనెను. వారట్లే చేసిరి. చెట్టంతయు నొకమాఱుగ గదలిపోయెను.

అట్లే - ఈశ్వర తేజోంశభవులవుల్ల్ నాయామూర్తుల నాయా మంత్రములతో నాయాశాఖలవారు వేఱువేఱు తీరుల గొలుచు చుందురు. వారిధ్యానమున తన్మంత్రాధినేతయవు నామూర్తియే సంతసించునుగాని సర్వమయమవు నద్వితీయ పరబ్రహ్మము ప్రసన్నము కాబోదు. సర్వమూలమవు అపరతత్వమును ధ్యానించునెడల విరాట్పురుషుననుగ్రహమును, సర్వదేవతోపాసనా ఫలితమును పొందనవును.

వృక్షప్రవృత్తిన్యాయము

చెట్లు పెరిగి విస్తరించినట్లు.

ఎట్టిప్రయత్నమును, ఎవరితోడ్పాటును లేకయే వృక్షములు బాగుగ పెరిగి విస్తరించును.

ఆప్రయత్నముగ లాభప్రాప్తి కలుగునపు డీన్యాయము వాడబడును.

వృక్షమూలనిషించనన్యాయము

చెట్తుమొదటలో నీరుపోసినట్లు.

చెట్టుమొదట పోయబడిన నీటిని వేళ్ళు బోదకు, ఆకులకు, కొమ్మలకు పంపును. దద్ద్వారా చెట్తు పెరిగి ఫలించును.