ఈ పుట ఆమోదించబడ్డది
124

సంస్కృతన్యాయములు

వృద్ధకుమారీవరన్యాయము

ఒకవృద్ధుడు, కన్య వరములు కోరుకొనినట్లు.

ఒకయూరిలో నొక వృద్ధబ్రాహ్మణుడుండెను. అతడు గ్రుడ్డివాడు, దరిద్రుడు, అవివాహితుడు. అత దష్టకష్టములు ననుభవించుచు విసివి అడవికి పోయి తపస్సు చేసెను. పరమేశ్వరుడు మెచ్చి ప్రత్యక్షమై వరమడుగమన నావిప్రుడు విప్రుల కొకటికంటె నెక్కువగ వరములడుగుట కధికారము లేనందున నొకేవరముతో తనయన్నికష్టములు తీరునట్లును, లేనివి ప్రాప్తించునట్లును వరమును పొంద నిశ్చయించి "దేవా నామనుమడు రాజసింహాసనమున వధివసింపగా జూచికొను భాగ్యమును దయసేయుము" అని కోరెను. దానితో తనవార్ధక్యము, దారిద్ర్యము పోవుటయు, తాను యువకుడై వివాహము చేసికొనుటయు, సంతానప్రాప్తియు, మహైశ్వర్యము, దీర్ఘాయువు లభించవలయునని అతనియాశయము.

అట్లే-- ఓకకన్యక ఎన్నిసంవత్సరములు గడచినను వరుడు దొఱకక అవివాహితయై యున్నందుల కెంతయు జింతిలియొకనా డేకతమ అడవికి పోయి తపస్సు చేసి దేవుని మెప్పించెను. భగవానుడు దర్శన మిచ్చి యభీష్ట మిత్తు కోరుకొనుమనెను. ఆమె చాలదీర్ఘముగ నాలోచించి బహులాభప్రాప్తింగోది "నాపుత్రులు బంగారపళ్ళెరములో ఇష్టమృష్టాన్నము లారగించుచుండ జూచి యానందించు నట్లు వరమి"మ్మనెను. భగవానుడ వల్లెయనెను. తన