ఈ పుట ఆమోదించబడ్డది
123

సంస్కృతన్యాయములు

ఆకాశమున బుట్టిన శబ్దము గాలితో గలిసి విస్తృతమై అతిశయించి శ్రోత్రపధమును జేరును.

ఒకవిషయము ముందు స్వల్పముగ వెలువడి ఉత్తరోత్తర మభివృద్ధి నొదునపు డీన్యాయ ముపయోగింపబడును.

తొలుత నొకటియై తానే కదంబముకుళముల ట్లనేకముగ విస్తరించునపుడును ఇయ్యది వచింపబడును.

"సర్వ: శబ్దో నభోత్పత్తి: శ్రోత్రోత్పన్నస్తు గృహ్యతే, వీచీతరంగన్యాయేన తదుత్పత్తిస్తు కీర్తితా. కదంబముకళచ్చాయా దుత్పత్తి: కస్యచి న్మతే." అని పండితోపదేశము.

వృకాబ్ంధనన్యాయము

కొంగలను బట్టుకునే యత్నమటులు.

కొంగలను పట్టుకొని టేట్లు? అని అడుగంబడి చతురు డొకడు-- "కొంగ నెత్తిన పేరిన నేయి పెట్టి యుంచవలను. ఎండ కానేయి కరగి దానికళ్ళలోనికి పోవును. అపుడది కళ్ళు కనబడక కంగారుపడును. ఆసమయమున దానిని సుళువుగ పట్టుకొనవచ్చును." అని చెప్పెనట.

అనవసరపు నంశము తేల్చకయే తరువారి యసంబధ్ధాంశము నూరక శాఖాచంక్రమణము చేయుట.

"దోమను చంపు టెట్లు అనిన దోమనుపట్టి దానినోటిలో గంధకధృతి యించుక పోసిన నది సులభముగ జచ్చును" అని చెప్పినట్లు.