ఈ పుట ఆమోదించబడ్డది
119

సంస్కృతన్యాయములు

విషకృమిన్యాయము

విషములో పుట్టినపురువు విషమే తిని జీవించినట్లు.

ఛాణక్యనెతిదర్పణమున నీన్యాయము నుద్బోదించుచు నిట్లు నడువబడియున్నది.

"విప్రాస్మి న్నగరే మహాన్ కధయ క: ? తాకద్రుమాణాం గణ:; కోదక్షు: ?

పరవిత్తదారహరణే సర్వోz-పి పౌరో జన:; కోదాతా?

రజకో, దదాతి వసనం ప్రాత ర్గృహీత్నానిశి; తత్కిం జీవసి హేసఖే?

విషకృమిన్యాయేన జీవామ్యహం."

ఒకబ్రాహ్మణు డొకయూరికి యాచనకై యేగి యూరి వెలుపల కాంపించిన బ్రాహ్మణుని యూరి పరిస్థితులు దెలిసికొనుతలంపున నిట్లు ప్రశ్నించెను. వెనువెంటనే ఆబ్రాహ్మణుడుకూడ సమాధానము నిచ్చెను.

"ఓవిప్రుడా! ఈయూరిలో సందరికన్న గొప్పవాడెవడు?"

"అదిగో, ఆకనబడు తాడితోపు."

'ఇచట సమర్ఘు డెవడు?

"పరుల ధనమును, భార్యలను అమాంతముగ దొంగిలించుటయు దీయూరివా రందఱును సమర్ధులే."