ఈ పుట ఆమోదించబడ్డది
118

సంస్కృతన్యాయములు

విప్రతిషేధన్యాయము

రెండుకార్యములకు తుల్యబలవిరోధములు వచ్చినపుడొక దానిని విడిచి బలవత్తరమవు రెండవదాని నాశ్రయింపవలెను. ఇది వ్యాకరణమర్యాదయందలిది.

విశ్వజిన్న్యాయము

విశ్వజిద్య జ్ఞఫలితమునవలె.

"విశ్వజిత్తు" అను నొక యజ్ఞము కలదు. ప్రపంచమునంతయు జయించి ఈయజ్ఞమును చేసి తిరిగి సర్వస్వము దానము చేయవలెను. ఇట్లాచరింపబడిన విశ్వజిదధ్వరమునకు ఫలము విశ్వవిజయమా, లేక స్వర్గమా? అన సర్వయజ్ఞఫల మవు స్వర్గమే అని నిర్వచింపబడినది.

"అనాదిష్టఫలే కర్మణి స్వర్వ: ఫఱమ్! అనుపదిష్టఫలస్వరూప మవు కర్మమునకు స్వర్గమే ఫలము"-- ఎట్లన-- "స్వర్గఫలేషు కర్మసు కర్తవ్యేషు ఫలవచనం నైవొచ్చారయన్తి గమ్యత ఏవేతి. కర్తవ్యములై స్వర్గఫలములైన కర్మములకు ఫలవచనము నుచ్చరింపరు. అయినను ఔషంగమున స్వర్గఫలమే తెలిసికొనబడును."

చెప్పబడకయే అనుషంగమున నాయాకర్మముల శుభాశుభఫలితములు తెలియనవును.

విషకీటన్యాయము

విషములో పుట్టినపురుగు విషమే తిని జీవించునట్లు.