ఈ పుట ఆమోదించబడ్డది
116

సంస్కృతన్యాయములు

చించివైతురు, కొందఱు కఱువబడినవానిచెవిలో మఱొకనిచే 'పాఱెపో' అని చెప్పింతురు. మఱొకరకము కలదు: పాము కఱచినది అని వార్త తెచ్చినవానిని మంత్రగాడు వెనుకముందు లాలోచింపక దౌడ పగులునట్లు కొట్తును. ఆదెబ్బతో కఱువబడినవాని బాధ తగ్గిపోవును. దెబ్బ ఎంతతీవ్రముగ తగిలిన అంతత్వరలో బాధతగ్గును. వాని పాముకాటు విని దౌడపాటునకు కారణ మగును.

(వెంకి పెళ్ళి సుబ్బి చావునకు వచ్చెనన్నట్లు)

వాలకర్కటకన్యాయము

నక్క తనతోక పీతకన్నములోబెట్టి అది పట్టుకొనగా నీఅలికిలాగి తినును.

దుర్మార్గుడు మంచివాడువలె సంచరించుచు అవకాశము లభించిన వెనువెంటనే హానిచేయును.

వాలిసుగ్రీవన్యాయము

వాలిసుగ్రీవులలోని తారతమ్యమువలె.

"వాలిసుగ్రీవులు పోరుచుండ సుగ్రీవుని పక్షమున జేరి శ్రీరాముడు దాగియుండి కొట్తుటవలన వాలి చనిపోవలసివచ్చెను". అనిన వాలి సుగ్రీవునికంటే బలవంతు డగుట యేగాక 'దాగియుండి ' అనుటవలన శ్రీరామునకును అజయ్యుడు అని ద్యోతమానమవుచున్నది.