ఈ పుట ఆమోదించబడ్డది
113

సంస్కృతన్యాయములు

వహ్నిధూమన్యాయము

పొగను జూచి నిప్పున్మదని తెలిసికొనుట. "వహ్నీమాన్ పర్వత:" "ధూమవత్త్వాత్" పొగ వచ్చు చున్నది గావున కొండపై అగ్ని పుట్టినది అనిగురుతించుట. పొగ వచ్చుచున్నదే, వహ్ని యున్నదా ఏమి? అని తొలుత అనుమానము; పిదప, వహ్నీలేనిదే పొగయుండదు కావున తప్పక వహ్నియున్నది అని నిర్ధారణము.

కారణముచే ననుమానించి కార్యము నూహించుట యని న్యాయతాత్పర్యము.

వహ్నివిస్ఫులింగన్యాయము

అగ్నినుండి అగ్నికణములు బయలుదేరినట్లు.

అగ్నిదుండి బయలువెడలిన విస్ఫులింగములు తదగ్న్యంశములేకాని అగ్నిభిన్నములు కావు.

అట్లే పరమాత్మనుండి రకరకముల సృష్ట్లులు బయలుదేరుచున్నది. అవన్నియు నాతని కళామాత్రములేగాని తద్బిన్నములు గావు.

("సోz-కామయత, బహు స్వాం ప్రజయేయేతి" ఆ పరమాత్మయే "నేను అనేకరూపములు గలవాడ నయ్యెదను" అని కోరి వివిధరూపములుగ తనను విభజించికొని నట్లు శ్రుతులు నొడువుచున్నవి. కావున తదభేదము సర్వధా సుసిద్ధము.)

నీటినుండి చిందిపడు నీటిబిందువులు సిరే అనునట్లు