ఈ పుట ఆమోదించబడ్డది
104

సంస్కృతన్యాయములు

దీనిని 'లోష్టప్రస్తరన్యాయము' అనియు నందురు.

అట్టిచో ప్రస్తరము = ప్రస్తారము అని యెఱుఁగ నగును.

లోష్టలగుడన్యాయము

మట్టిముద్ద, కఱ్ఱమాదిరి.

కుమ్మరి మట్టిముద్దను కఱ్ఱతోఁ గొట్టి కుండలు తయారు చేయును.

బాధించువాఁడు, బాధింపఁబడునాతఁడు నొకచో వచింపఁ బడు సందర్భమున నీన్యాయ ముపయుక్తము.

లోహకపాలన్యాయము

లోహపుపాత్రలవలె.

అభేద్యములు అని ఆశయము.

పురోడాశకపాలములకు నూతన మృత్కపాలములే విహితములు కాని లోహకపాలములు కావు.

"య న్నవే భాజనే కార్యం నాన్యథా కర్తు మర్హతి"

(కావున అవిహితములవుట లోహకపాలములవలె అయోగ్యములు అగుచో నీన్యాయ ముపయుక్తము.)

లోహఘటన్యాయము

లోహపుకుండవలె. (అభేద్యము)

ఇనుపకుండకు ఱాతితెడ్డు అన్నట్లు.