ఈ పుట ఆమోదించబడ్డది

86

సంస్కృతన్యాయములు

కరకంణము, నీలేందీవరముల వలె.

మృగసంగీతన్యాయము

వ్యాధుఁడు అరణ్యములో లేళ్లను బట్టుటకై వల పన్ని ఇంచుక దూరమున తానుండి ఒకవిధమగు రాగముతో సంగీతముపాడును. లేళ్ళు ఆరాగముచే మనస్సులు లాగఁబడి వరుసగా పోయి వలయున్నదను జ్ఞానమే లేక మందలుమందలుగ వలలోఁ జిక్కుకొనును.

అసార మనియు, కష్టభూయిష్ఠమనియు నెఱుఁగక తనుజాద్యాలాపలోలుపతా కిరాతగీతాపహృతమైన మానసమున నరమృగములు రాగమూలకసంసారవాగురిం దగుల్కొని నశించును.

"మ. భవకాంతారముమధ్యమందు స్వపరీవార క్రులాపంబుపే ర్దవు వ్యాధాగ్ర్యుసమానగానవిధిచే నాకృష్టచిత్తమ్మునన్‌ జవ మొప్పం జని రాగవాగురి విలగ్నంబై మృతిం గాంచు దిక్కెవరున్‌ లేమి నెచోట మర్త్యమృగ మెంతేఁ గుంది రాధాధవా!"

వ్యాఖ్యాతల రాధాధవశతకమునుండి.

మృతమారణన్యాయము

చచ్చినవానినిఁ జంపినట్లు.