ఈ పుట ఆమోదించబడ్డది
85

సంస్కృతన్యాయములు

మూషాన్తః సుషిరా మృత్ప్రతిమా! యథాగ్నిసంపర్కాద్ద్రవీభూత త్రామం మూషాయాం నిషిక్తం నిక్షిప్తం సత్తన్నిభం జాయతే తత్సమానాకృతి భవతి తథాచిత్తమపి రూపాదీన్‌ విషయాన్‌ వ్యాప్నువ త్తన్నిభం దృశ్యతే తదాకారం జాయత ఇత్యర్థః||

రాగిచెంబులు పోతబోయువాఁడు రాగి బాగుగా కఱగి మూసలోఁ బోయును. వెంటనే అది ఆమూస యొక్క ఆకారంమువంటి ఆకారము నొందును. అట్లే చిత్తము సయితము రూపాదివ్యాపారవ్యాప్తమై తదాకార మవును. "విద్యా దన్నమయేనైవ మూషాయాం దృతతామ్రవత్‌, సర్వాన్‌ ప్రాణమయాదీం స్తాన్ రచితా న్పురుషాకృతీన్."

తైత్తిరీయవార్తికము.

మృగతృష్ణాన్యాయము

ఎండమావులను జూచి నీరని భ్రమించి పరుగిడినట్లు.

మరుమరీచికాన్యాయము జూడుము.

మృగభియాసస్యాఽనాశ్రయణన్యాయము

పశువులు తినివేయు నేమో యనుభయమున పొలములలో పైరు వేయుటమే మానినట్లు.

భిక్షుభియా స్థాల్యనాశ్రయణన్యాయము రకమున.

మృగవాగురాన్యాయము

వాగురా అనిన మృగములను బట్టు వల అని అర్థము.

మృగవాగురా అనినను అయ్యదియే అర్థము.