పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/94

ఈ పుట ఆమోదించబడ్డది

గలుగువా డెన్నడు దు:ఖము పాలుగాడు. మఱియు దనకు గలుగ బోవు పరాభవము దొలగించుకొన గలుగును. అనుచితమైన పనులు చేయుట, బలవంతునితోడి పగ, స్త్రీల యెడ నమ్మకము ననునవి మృత్యువునకు ద్వారములు.

ఇట్లు సంభాషణము జరిగిన వెనుక భర్త భయములేదని భార్యకు నచ్చ జెప్పెను. తుదకు భార్య యచటనే ప్రసవించెను.

ఆదంపతుల సంభాషణము లన్నియు విన్నవా డగుటచేత సముద్రునకు వారి శక్తి యెఱుగవలయునని తలపు గలిగెను. తన తరంగములచే వాని గ్రుడ్లున్నియు నపహరించెను.

అందు కాడుతీతువు మిక్కిలి విచారించెను. మగతీతువు భార్య నోదార్చి తనజాతిపక్షుల నెల్ల రావించి తనకు గలిగిన హాని వానికి వివరించెను. వాని సానుభూతి సంపాదించి వాని నన్నిటిం దీసికొని గరుత్మంతునికడ కేగెను. వినయపూర్వకముగా వందన మొనరించి "ప్రభూ! తప్పేమియు జేయకున్నను సముద్రుడు నా కపకార మొనరించినాడు. నాసంతతిని నాశన మొనరించినాడు" అని విచారమున బలికి తనకు గలిగిన కష్టములు వివరించెను.

గరుత్మతుంతు డీమాటలు విని జాలినొంది తనస్వామియగు విష్ణువునకు వృత్తాంత మంతయు నివేదించెను. సేవకుని