పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/91

ఈ పుట ఆమోదించబడ్డది

అట్లే ప్రియమిత్రు డొకవేళ గొంత తప్పిద మొనరించినను విడిచి వేయవచ్చునా? నాకు సంజీవకునితోడి చెలిమి మేర లేనిది కదా! ఇండ్లు, సకల సామగ్రులు గాల్చివేయునదియే యైనను సకల జనులకు నగ్ని యాదరణీయముగాదా?" ఇట్లు ప్రశ్నించిన రాజునకు దమనకు డిట్లనియె.

"సుతునియందుగాని, యమాత్యుని యందుగాని తటస్థునియందుగాని మితిమీరిన ప్రీతి జూపు రాజును లక్ష్మి విడుచును. పథ్యపు బదార్థ మంతరుచిగా లేకున్నను దుద కారోగ్యసుఖము గలిగించును. హితము చెప్పువాడును, నది చక్కగా గ్రహించువాడును గలుగుచోట లక్ష్మీ నిలిచియుండును. నీవు చిరసేవకుల నీసడించి నూతనముగా వచ్చినవాని కాధిక్య మిచ్చితివి." దమనకుని యీమాట లాలకించి "ఇది కడు వింతగా నున్నది. నన్ను శరణు సొచ్చి; యభయ మొసగి పోషించుచున్న నన్నే యాత డెట్లు ద్రోహము సేయును?" అని పింగళకుడు ప్రశ్నింపగా మరల దమనకు డిట్లు పలికెను.

"ఎన్నివిధముల యత్నించినను గుక్కతోకకు వంకర పోజాలదు. దుర్జను డెన్ని యుపకారములు పొందినను వాని మనసు పరిశుద్ధము కానేరదు. విషవృక్షము లమృతము వోసి పెంచినను మంచి పండ్లీయ జాలవు. వర్ధనము, పోషణము దుష్టునకు మంచిగుణములు గలిగింప లేవు. హానినుండితప్పించు మిత్రుడును ననుసరించి వర్తించు స్త్రీయును, గర్వము గలి