పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/86

ఈ పుట ఆమోదించబడ్డది

సర్పము మన సంతతి నెల్లప్పుడు దినివేయుచుండెను గదా! అవినీతురాలగు భార్య, దుష్టుడగు మిత్రుడు, నెదురాడు సేవకులు, సర్పముగల యింటిలో నివాసము నిక్కముగా మహాపాయకరము" అని పలుకగా భర్త యిట్లనెను.

"ప్రియురాలా! భీతిల్లకుము. ఇంతవఱ కీ సర్ప మొనరించిన యపరాధములు సహించితిమి. ఇక నోర్వదగదు. తప్పక ప్రతీకార మొనరించెదను."

ఆమాటలకు "బలవంతునితో విరోధము మేల?" యని భార్య పలుకగా భర్త "నీకు సందేహము వలదు. బుద్ధిబలముగలవానికి దేహబలముతో నిమిత్తము లేదు. బుద్ధిబలములేకున్న శరీరబల మెందులకు గొఱగాదు. మదించిన సింగమును బుద్ధిబలముచేతనే కదా కుందేలు చంపినది నీకా కథ యెఱింగించెదను; వినుము.

బుద్ధిబలమున సింహముం జంపిన కుందేటి కథ

మందర మనెడి కొండమీద దుర్గాంత మనెడి సింహము గలదు. అది యెల్లవేళల జంతువు లన్నిటిని వేటాడి చంపు చుండెను. ఆ యుపద్రవమునకు దాళలేక యొకనాడు జంతువు లన్నియు సభచేసి యాలోచించుకొని తమ ప్రతినిధిగా నొకజంతువు నాసింహము నొద్దకు బంపినవి. అది సింహమును సమీపించి వినయముతో "మృగరాజా! ఒకేపర్యాయ మనేక జంతువులను జంపినయెడల నీ కేమి లాభము. జంతు