పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/83

ఈ పుట ఆమోదించబడ్డది

లతో బరిచర్యలు సేయుచుండెను. మఱియు వేదాంతార్థము లెఱుగగోరిన వారివలె నటించుచు నాతని నమ్మించి యాతని వెంట దేశాటన మొనరించుచుండెను.

ఒకనాడు వారిరువురు దారి బయనము సేయు చుండగా నాషాడభూతి యొకచోట దటాలున నిలిచెను. తనబట్ట కంటుకొనియున్న యొక పూరిపుడక చేతబట్టుకొని దేవశర్మకు జూపి "స్వామీ! నిన్నరాత్రి మనము నిదురించిన వారియింట నీపూరిపుడక నావస్త్రమున కంటుకొన్నది. ఇది వారి సొమ్ము. పరులసొమ్ము తృణమైన నపహరించుట ధర్మముగాదు. కాబట్టి యిది వారి కిచ్చి వచ్చెదను" అని పలికి కొంతదూరము వెనుకకు బోయి దాని నచట బాఱవైచి పిమ్మట దేవశర్మను గలిసికొనెను.

ఈ చర్య కా సన్న్యాసిని కడు నచ్చెరువొందెను. ఆతని నిస్పృహకు మనసున మెచ్చుకొనెను. తాను ధరించుచున్న బొంత మోయుటకు బద్ధకించి దానిని శిష్యునకిచ్చి పదిలముగా దీసికొనిరమ్మని చెప్పెను. వాడు మిక్కిలి సంతసించి యాబొంత నెంతయో జాగరూకతో మోయుచుండెను. మునుపటికంటె గురువునకు విశ్వాస మధిక మగునట్లు మెలగు చుండెను.

వా రట్లు పయనించుచు నొక యరణ్యమార్గమున నుండగా సూర్యు డస్తమించెను. ఆచటనున్న యొక చెఱువుం