పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/82

ఈ పుట ఆమోదించబడ్డది

గౌరవముగా నిచ్చివేయుము. లేనిచో నీబంధము నుండి నీకు విముక్తిగలుగుట యసంభవము" అని స్పష్టపఱచెను. పది మందియు విన్నచో నింకను నవమానము గలుగునని వెంటనే తనతగ్గఱనున్న మణులన్నియు నిచ్చివైచి శూన్యహస్తుడై యాతడు మిక్కిలి విచారము నొందెను.

ఇట్లే యాషాడభూతి యనువానిచే మఱొక సన్న్యాసికి, మేషయుద్ధమువలన నొక నక్కకు స్వయంకృతాపరాధముచే హాని సంభవించెను. నీకాకథయు వివరించెదను వినుము.

సన్న్యాసిని మోసగించిన యాషాడభూతి కథ

పూర్వము దేవశర్మయను నొక సన్న్యాసియుండెను. అతడు సన్న్యసించినను లోభగుణము విడువలేకుండెను. జనులకు నిత్యము వేదాంతవిషయము లుపన్యసించుచుండువాడు. వారు భక్తితో దెచ్చియిచ్చు కానుకలయెడ ననాదరము జూపువాడు. కాని వారిం జిన్నబుచ్చ నిష్టములేని వానివలె నటించి యవి స్వీకరించుచుండువాడు. ఇట్లు సంపాదించిన ధనమంతయు నొక బొంతలో నుంచి యెవ్వరికి దెలియకుండు నట్లు దానిం గుట్టి మీద గప్పుకొని దేశసంచారము చేయు చుండువాడు.

ఆషాడభూతి యను పేరుగల వంచకు డీవిషయము గుర్తించెను. అతడా సన్న్యాసింజేరి యధికమైన భయభక్తు