పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/81

ఈ పుట ఆమోదించబడ్డది

జేతితో దాకెను. వెంటనే యది చిత్రమే యయినను నామె తన చరణముచేత నారాజకుమారుని దన్నెను. అత డెప్పటివలె దన రాష్ట్రమందలి యుద్యానవనమున బడి యెన్నడు నిక రత్నమంజరి జాడగానజాలక దు:ఖపీడితు డయ్యెను. ఇంక సన్న్యాసి కథ వినుము.

స్వయంకృతా పరాధమువలన జెడిన సన్న్యాసికథ

మలయపర్వత సమీపమున నొకానొక సాధువు నివసించుచుండు వాడు. ఆత డొకపుడు పండ్రెండుసంవత్సరములు పయనము సాగించి మలయపర్వత ప్రదేశమునుండి కాంచనపురమను నొకనగరము జేరెను. నాటిరేయి యానూతననగరమున నొకవిశాలభవపు టరగుమీద బండుకొనెను.

అదియొక వేశ్యాగృహము. గృహద్వారమున దారు నిర్మితమైన భేతాళ విగ్రహమొకటి గలదు. దాని శిరము మీద బ్రశస్తమైన యొకమణి ప్రకాశించుచుండెను. దానిం జూడగా నాసాధువున కాస కలిగెను. దానింగ్రహింపదలచి యాతడు చేయిచాచి తాకినంతనే బేతాలుని చేతు లా సాధువును బంధించి వైచినవి. బేతాళునిచేతుల బిగి కాగలేక యాత డాక్రందన మొనరించుచుండగా లోనుండి యొక పరిచారిక యరుదెంచి "ఓయీ! నీవు మలయపర్వతము దరినుండి వచ్చితివి. నీయొద్దనెన్నో మణులుండవలయును. వాని నన్నిటిని