పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/73

ఈ పుట ఆమోదించబడ్డది

అని పలికి కరటకుని నొక చెట్టుక్రింద గూరుచుండ నియమించి సంజీవకుని యొద్ద కేగి యిట్లు పలికెను.

"ఓ వృషభేంద్రా! ఈయడవిం గాపాడుటకై మృగ రా జగు పింగళకునిచే నియమింపబడిన సేనాధిపతి కరటకు డిట్లాజ్ఞాపించుచున్నాడు. "త్వరితముగ నాకడకు రమ్ము. లేదేని యీ యడవినుండి దూరముగ దొలంగి పొమ్ము. ప్రభువు కోపించిన యెడల గలుగు ఫలితము లెఱిగియే యుందువు. ప్రభువుల కాజ్ఞాభంగము, బ్రాహ్మణుల కనాదరము, స్త్రీలకు పృథజ్మందిర నివాసము శస్త్రమక్కఱ లేని చిత్రవధ వంటిది."

సంజీవకుడు మిగులభయపడి చప్పున గరటకుని కడకు బోయి సాష్టాంగనమస్కారముచేసి "సేనాపతీ! నే నెఱుగక చేసిన తప్పు లున్నచో క్షమింపుము. ఇక నీయాజ్ఞానుసారముగా మెలగుదును." అని విన్నవించుకొనెను.

అది విని కరటకుడు "ఓవృషభమా! నీవు మా యరణ్యమున నివసించుచున్నావు. కావున మాప్రభువుని కడకు వచ్చి నమస్కరించి విధేయుడవై యుండుము." అని యాజ్ఞా పూర్వకముగా బలికెను.

దానికి సంజీవకుడును "నా కభయ మొసగుము. నీయానతి చొప్పున వచ్చి స్వామిసేవ చేయగలను." అని