పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/68

ఈ పుట ఆమోదించబడ్డది

మాటలు విని దమనకుడు "మనవి చేసి కొనుచుంటిని. ప్రభువువారు నీరు ద్రావుటకై యమునకు బోవుచు నీరు ద్రావకయే వెఱ గొంది వెనుదిరిగివచ్చినట్లు కానబడుచున్నది. ఇందులకు గారణము దెలిసికొని యవసరమైన సేవ చేయదలచి దర్శనమునకు వచ్చితిని" అని వినయమున బలికెను.

అంతట బింగళకుడు "దమనకా! అడుగ దగిన యంశమే యడిగితివి. ఈరహస్యము దెలిపి యాలోచన మడుగుటకు నమ్మదగినవా డొక్కడును గానరాకున్నాడు.

ప్రస్తుత మీవనమున కేదో యొక పపూర్వ మృగ మేతెంచియున్నది. కాబట్టి మన కియ్యది విడువదగినదని తోచుచున్నది. ఆకారణమున వెఱగొంది యుంటిని. ఇంతకు ముందే యొక మహాధ్వని వినవచ్చినది. ఆశబ్దము బట్టి చూచిన నాజంతువు మహాబలముగలదై యుండవలయును" అని పల్కెను.

అది విని దమనకుడు "ఔను; ఆధ్వని మేమును విని యుంటిమి. అది భయము గలిగించునట్లుగనే యున్నది. అయినప్పటికి నాలోచన లేకుండ ముందుగానే దేశత్యాగము చేయుటకును, యుద్ధమునకు బూనుకొనుటకు మంత్రియైన వా డెట్లు ప్రోత్సహించును? ఇట్టి విషమ పరిస్థితులలోనే భృత్యుల సారము దెలియవలయును. బంధువులు, భృత్యులు, స్త్రీలు ననువారి బుద్ధియు, సామర్థ్యము నాపద లనెడి నొఱపురాళ్ళ