పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/60

ఈ పుట ఆమోదించబడ్డది

అపు డచటి గాడిద కుక్కతో "సఖుడా! దొంగ యింట జొచ్చుట చూచి యుంటివి గదా! గట్టిగా మొఱిగి యజమానుని మేల్కొల్పుటకు బ్రయత్నింపవేల? ఇది నీపని కాదా?" యన శునక మిట్లనెను. "నావిధిని గుఱించి చర్చింప నీకేమి యవసరము? నీవేమి యెఱుగుదువు. రాత్రియు బవలు గష్టమనక యీయిల్లు గాచుకొని యుందును. యజమానుడు నాయుపయోగము గొంచెమైనను గ్రహింపకున్నాడు. నా కాహార మవసర మనెడి యూహయే యాతనికి లేదు. అవసరము లేనపు డధికారులకు సేవకులయం డాదరము తొలగి పోవుటలో నాశ్చర్య మేమున్నది?"

ఆ మాటలు వినుసరికి గార్దభమునకు గోపము వచ్చెను. "పని గలుగునపుడు లంచమడుగు భృత్యుడు, మిత్రుడు నీచులు" అని పలుకగా "గార్యకాలమున మాత్రమే భృత్యులయం దాదరము జూపు ప్రభువు యోగ్యు డెట్లగు"నని శునకము గార్దభమును బ్రశ్నించెను.

దానికా గాడిద మఱింతగా గోపించి "యాపత్కాలమున స్వామికార్యము విడనాడు నీవు పాపాత్ముడవు. పోనిమ్ము. నీతోడనే యున్నదా? ఏలికను లేపి నాఋణము దీర్చు కొందును." అని పలికి గట్టిగా నోండ్రపెట్టెను. ఆధ్వనికి గాడనిద్రలోనున్న రజకుడు మేలుకొని నిద్రాభంగమైనదని కోపించి యొకబడియ చేతబట్టుకొని తిన్నగా గాడిద యొద్దకు