పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/5

ఈ పుట ఆమోదించబడ్డది

సంపూర్ణ నీతి చంద్రిక

ఉపోద్ఘాతము

భారత భూమియందు బ్రవహించుచుండు పవిత్రనదులలో గంగానది మిక్కిలి ప్రసిద్ధి కెక్కినది. ఆనది యొడ్డున సంపదలతో నిండిన పాటలీపుత్ర మను నగరము గలదు. సమస్తమయిన ప్రభుగుణములు గలిగిన సుదర్శను డను రాజానగరము బరిపాలించుచుండెను.

ఒకనా డొక బ్రాహ్మణుడు పఠించుచున్న రెండు శ్లోకము లారాజు వినుట సంభవించెను. ఆ శ్లోకములభావ మిది:

"మానవులకు సందేహము లన్నియు బోగొట్టి, సామాన్యదృష్టి కందని విషయములను గోచరింపజేయు నయనము శాస్త్రము. అది లేనివాడు కను లుండియు గ్రుడ్డివాడే. యౌవనము, ధనసంపద, ప్రభుత్వము, నవివేకము నను నాల్గింటిలో నే యొక్కటియైన ననర్థము గలిగింప జాలును. ఈ నాలుగు విషయములు నొక్కచోట గూడి యున్నచో వేఱుగా జెప్పనవసరము లేదు."

సుదర్శనుని కుమారులు శాస్త్రము లభ్యసింపక యెల్లపుడు జెడుదారుల సంచరించుచు నాటపాటలం దాసక్తులై