పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/43

ఈ పుట ఆమోదించబడ్డది

డనెడి లేడి యొక వేటకానిచే దఱుమబడి యచటికి బరువెత్తుకొని వచ్చెను. అదిచూచి భయపడి మంథరుడు జలములో బ్రవేశించెను. మూషికము కలుగులోనికి బాఱిపోయెను. వాయసము చెట్టుమీది కెగిరి నలువైపులు చాలదూరము పరికించి భయమునకు గారణమేమియులేదని తెలిసికొని మంథర హిరణ్యకులకు దెలిపెను. మరల మువ్వురు గూడుకొనిరి. అపుడు వణకుచు నచటనున్న మృగముం జూచి మంథరుడు "నీ వెవడవు? ఏల యిచటికి బాఱి వచ్చితివి?" అని యడుగగా, "వేటకా డొకడు తఱుముచుండగా భయపడి తప్పించుకొని వచ్చి మీ శరణము జొచ్చితిని. మీ చెలిమి గోరుచుంటిని." అని యా హరిణము బదులు పలికెను.

అపుడు హిరణ్యకుడు "మిత్రమా! స్వాగతము. స్వేచ్ఛముగా మాతోబాటు స్వగృహమునందువలెనే సంచరింపుము" అని పలికి, యది యాహారపానీయములు దీసికొని నెమ్మదించిన తర్వాత "సఖుడా! నిర్జనమైన యీ వనమున నిన్నెవరు తఱుముకొని వచ్చిరి? వేటకాండ్రెవరైన నపుడపు డచట సంచరింతురా?" యని యడిగెను.

దానికి మృగ మిట్లు చెప్పెను. "కళింగదేశమున రుక్మాంగదు డనురాజు గలడు. ఆతడు దిగ్విజయమునుగోరి వచ్చి చంద్రభాగానదీతీరమున సేనలను విడియించెను. ప్రాత:కాలమున నాతడు కర్పూరసరస్సునొద్దకు రాగలడని