పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/32

ఈ పుట ఆమోదించబడ్డది

మిగుల గౌరవింపవలయును." అని హిరణ్యకునితోడి తన చెలిమిని గుఱించి వివరించెను.

అంతట మంధరుడు హిరణ్యకుని మిక్కిలి పూజించి "హిరణ్యకా! నీ వీ జనరహితమైన యడవియందేల నివసించుచుంటి" వని యడిగెను. అపుడు హిరణ్యకుడు తన వృత్తాంతము నిట్లు చెప్పదొడగెను.

"చంపక మను నగర మొక్కటి కలదు. అందలి మఠములో సన్యాసులు పెక్కుమంది నివసించుచుందురు. అందు జూడాకర్ణు డను నొక యతి గలడు. అతడు ప్రతి దినము దాను భుజింపగామిగిలిన యాహారము భిక్షాపాత్రమందుంచి యా పాత్రము జిలుకకొయ్యకు దగిలించి నిదురించుచుండువాడు. నేను రోజురోజు మెల్లగా బయి కెగబ్రాకి యా పదార్థమును దినిపోవుచుండువాడను. ఒకనా డాతని మిత్రుడు వీణాకర్ణు డచటికివచ్చెను. జూడాకర్ణు డాతనితో మాటలాడుచు నన్ను భయపెట్టుటకై మాటిమాటికి గిలుక కఱ్ఱతో నేల మీద గొట్టుచు వచ్చెను. అదిచూచి వీణాకర్ణుడు "ఏల యటులు గొట్టుచుంటివి? నామాటలయం దిష్టములేదా?" యని చూడాకర్ణు నడిగెను.

"ఇష్టము లేకపోవుట గాదు, చూడుము, ఆ యెలుక ప్రతిదినము నా కపకారియై పాత్రమునందలి పదార్థము దిని వేయుచున్నది. దానిని బెదరించుటకై యిట్లుకొట్టుచుంటిని." అని చూడాకర్ణుడు బదులు పలికెను. అదివిని "యల్పజంతు